ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఎక్కడా కూడా ఇచ్చిన మాట వెనక్కు తీసుకున్న సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. రాజకీయంగా ఆయనను కక్ష సాధింపుతో ఇబ్బందులు పెట్టాలి అని చూసినా సరే ఆయన ఇచ్చిన మాటలో వెనక్కు తగ్గింది లేదు. హడావుడి లేకుండా లబ్ది దారులకు అందాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా అందుతున్నాయి. 

 

పెన్షన్ లు పెంచుతున్నట్టు ప్రకటించిన జగన్ మొదటి సంతకం దాని మీద చేసారు. రైతు భరోసా తో పాటుగా ఆరోగ్య శ్రీ, అలాగే అమ్మ ఒడి సహా అనేక కార్యక్రమాలకు వాస్తవ రూపమే చూపించారు జగన్. ఎక్కడా కూడా ఆయన ఎవరిని మెప్పించిన ప్రయత్నం చేయలేదు. తాను చెయ్యాల్సింది చేస్తూ జగన్ దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: