గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది వైఎస్సాఆర్ సీపి. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణా స్వీకారం చేసి నేటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదా అంటే ఏదో వారసత్వం.. డబ్బు.. పలుకుబడి ఉంటే రాదు.. ప్రజల మన్ననలు పొందాలి.. ఆ మన్ననలు పొందాలంలే ప్రజల నాడి తెలిసి ఉండాలి.  అందుకే వైఎస్ జగన్ ఎన్నికల ముందు నుంచి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు.  వారి ఇబ్బందులు ఎంటీ.. వారిని ఎలా ఆదుకోవాలి.. ఎలాంటి పథకాలు వల్ల వారు లబ్ది పొందుతారు.. అవినీతి రహిత పాలన అందించాలని ధృడసంకల్పంతో ఒక్క ఛాన్స్ తనకు ఇవ్వమని అడిగారు. అన్నట్టుగానే ప్రజలు వైఎస్ జగన్ కి జేజేలు పలికారు.

 

తన సంవత్సర పరిపాల గురించి మాట్లాడుతూ..  వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, అందుకే ఒక వ్యవస్థను తీసుకొచ్చామని.. అదే గ్రామ సచివాలయ వ్యవస్థ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.  ప్రజల వద్దకు పాలన అన్నట్టు ప్రజల వద్దకే పథకాలు.. అలా అయితే సంపూర్ణంగా ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని అన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు.. అలా చేస్తే ప్రతి నిరుపేద కష్టాలను తొలగించిన వాళ్లమవుతామని అన్నారు. అయితే సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పలువురు రాజకీయ నేతలు శ్లాఘించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: