ఏ మనిషి బతకటానికైనా కావాల్సినది గాలి, నీరు, ఆహారం. ఆహారం తినకుండా జీవించడం అసాధ్యం. కానీ తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకే తినకపోతే... ఇలాంటి మనుషులు కూడా ఉంటారా...? అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు బాల్యం నుంచి కుర్‌కురే, లేస్‌ లాంటి ప్యాకేజ్డ్‌ పదార్ధాలు తిని జీవిస్తున్నాడు. అన్నం మెతుకు అంటే ఆమడు దూరం పరుగెత్తే ఈ వింత మనిషి గురించి జిల్లాలో చర్చ జరుగుతోంది. 
 
సజ్జాపురం ఎస్సీ కాలనీకి చెందిన యాకోబు, ఏసమ్మ దంపతుల కుమారుడు చార్లెస్ ప్రస్తుతం మూడవ తరగతి చదువుతున్నాడు. పుట్టినప్పటి నుండి అన్నం మెతుకు ముట్టని చార్లెస్ కుర్ కురే ప్యాకెట్లు, బిస్కెట్లు తిని సరిపెట్టుకుంటాడు. ఇంట్లో వాళ్లు మందలించినా చార్లెస్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. అయితే వైద్యులు మాత్రం అన్నం తినకపోతే పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నాకు అన్నం తినబుద్ధి కాదని అన్నం పెడతానంటే మాత్రం ఆ దరిదాపుల్లో లేకుండా పోతానని బాలుడు చెప్పడం గమనార్హం, 

మరింత సమాచారం తెలుసుకోండి: