తెలగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా వైరస్ మొదలైంది.  మొదట విదేశీయుల నుంచి ఈ కరోనా వ్యాప్తి చెందినప్పటికీ దాని ఉద్రితి రాను రాను లోకల్ వాళ్లకు రావడం అనూహ్యంగా కేసులు పెరిగిపోవడం జరిగింది.  ఏపిలో ఈ మద్య కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు సీఎం జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి.  కొత్తగా నమోదైన కేసుల్లో మూడింటికి కోయంబేడుతో లింకులున్నాయి. గడచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాలను సేకరించారు.  కొత్త కేసుల్లో మూడింటికి కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు.

 

ఇవాళ 55 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు.  కాకపోతే.. ఇక గడచిన 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు. ఇక, విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 406 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం 217 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: