టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు విమర్శలు చేశారు. : సీఎం కేసీఆర్ దుర్మార్గపు పాలనలో ఎవరికీ గౌరవం లేదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ పాలనపై ఉత్తమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
రైతు రుణమాఫీ చేయని కేసీఆర్... రైతులకు శుభవార్త చెబుతానని చెప్పటానికి సిగ్గు లేదా...? అని ప్రశ్నించారు. రైతుబంధు, రూ.లక్ష రుణమాఫీ అందలేదని, పంటల బీమా రైతులకు ఇప్పటివరకు అందలేదని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా కేసీఆర్ సర్కార్ నీరు ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే రాష్ట్రంలో పంట పొలాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. ప్రాజెక్టులపై కేసీఆర్‌ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనలో ఎవరికీ గౌరవం లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: