కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డి లాక్ డౌన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర ఆంక్షలను కాదని రాష్ట్రాలు మినహాయింపులు ఇవ్వడం కుదరదని అన్నారు. దేశమంతటా లాక్ డౌన్ లేకపోయినా రాష్ట్రాలు లాక్ డౌన్ ను కొనసాగించుకోవచ్చని చెప్పారు. కఠిన ఆంక్షలు విధించుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో లాక్ డౌన్ ను పొడిగింపుపై సందేశాలు నెలకొన్నాయి. 
 
రేపటితో దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ ముగియనుంది. రేపు ప్రధాని లాక్ డౌన్ గురించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని లాక్ డౌన్ పొడిగిస్తారా...? లేదా...? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: