నడవడానికి పూర్తిగా తన కాలు సహరించక పోవడంతో ఆపరేషన్ చేయించుకుందామని పట్నం వెళ్లి మరో పది  నిమిషాలలో ఇంటికి చేరుతాం అనుకునే లోపే మృత్యువు కబళించిన దుర్ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడు లో చోటు చేస్తుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడుకు చెంది జల చిరంజీవి (42 ) తన కాలు బాగోలేక పోవడంతో తన భార్య స్వాతి  మరియు కుమారుడు పవన్ లను  తీసుకోని దగ్గరే ఉన్న హాస్పిటల్ కి వెళ్ళాడు. చికిత్స చేయించుకుని మధ్యాహన సమయంలో ఇంటికి బయలు దేరారు అయితే అడ్డంకి మండలం వెంకటాపురం గ్రామ సమీపానికి చేరిన వారు . ఓ 10  నిమిషాలలో ఇంటికి చేరుతాం అనుకున్నారు అంతా.

 

 

అయితే వెంకటాపురం దగ్గర నాగుల పాడు వెళ్లేందుకు హై వే ని దాటాలనుకుని తాము ఉన్న కారుని మళ్లించారు అయితే దురదృష్టవశాత్తు బెంగళూరు నుండి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న కారు చిరంజీవి వెళుతున్న కారును ఢీ కొట్టింది. అయితే ఈ యాక్షిడెంట్  లో  చిరంజీవి తీవ్రంగా గాయాలపాలు అయ్యాడు అయితే అతనిని హాస్పిటల్ కి తరలిస్తూ ఉండగా తీవ్ర రక్త స్రావంతో చనిపోయాడు. ఈ యాక్షిడెంట్ లో చిరంజీవి భార్య స్వాతి , కొడుకు పవన్ , డ్రైవర్ లు గాయాలపాలు అయ్యారు. అదేవిధంగా విజయవాడ వైపు వెళుతున్న కారులో ఉన్న మామిడిబత్తుల వెంకటశశిధర్, బి.హరీష్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని 108 లో తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: