గత రెండు రోజులుగా మిడతల దండు తెలంగాణాను బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ సహా కొన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న మిడతల దండు ఇప్పుడు తెలంగాణా వైపు కూడా వస్తుంది అని వ్యాఖ్యానించారు. కాని మిడతల తెలంగాణా వచ్చే అవకాశం లేదని అర్ధమైంది. 

 

మహారాష్ట్ర గొండియా నుంచి అది మధ్యప్రదేశ్ వైపు వెళ్ళింది. ఇక అటు నుంచి పంజాబ్ వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. గాలి దక్షిణం వైపు వీచే అవకాశం ఉందని అనుకున్నా సరే అది వీచే అవకాశం లేదని దండు వచ్చే సూచనలు లేవు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపి తెలంగాణా సర్కార్ చర్యలను తీసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: