ఇంటర్ ప్రశ్నా పత్రాల మూల్యాంకనం తెలంగాణాలో పూర్తి అయింది. 15 రోజుల్లో పరిక్షా ఫలితాలను ఇంటర్ బోర్డ్ వెల్లడించనుంది. పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాతే ఇంటర్ క్లాసులు మొదలవుతాయని ఇంటర్ బోర్డ్ అధికారులు చెప్తున్నారు. ఆగస్ట్ లో ఇంటర్ క్లాసులు మొదలు కానున్నాయి. 

 

ఇక ఇప్పటికే పదో తరగతి పరిక్షల తేదీని ఉన్నత విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 8 నుంచి పరిక్షలు జరుగుతాయి. మాస్క్ ఉంటేనే పరిక్షలకు అనుమతి ఇస్తారు. రెండు రోజుల  గ్యాప్ లో పరీక్షలను నిర్వహిస్తారు. కరోనా నిబంధనలు దృష్టి లో పెట్టుకునే పరిక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఇంటర్ క్లాసులు ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది అనే దాని మీద స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: