తెలంగాణాలో సామాజిక వ్యాప్తి లేదని హెల్త్ డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 వేల మందికి పరిక్షలు చేసినట్టు ఆయన వివరించారు.  కరోనా కేసులకు వెంటిలేటర్  అవసరం చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. కాగా తెలంగాణాలో కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. 

 

విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. వారి నుంచే ఎక్కువగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా సౌదీ నుంచి వచ్చిన వారికి కరోనా ఎక్కువగా సోకుతుందని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. దీనితో వారి విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా కేసులు రెండు వేలు దాటిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: