టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంతకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సంబంధించిన ఏ విషయమైనా అభిమానుల్లో ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. తాజాగా ఆమె పదో తరగతిలో హాఫ్ ఇయర్లీలో వచ్చిన మార్కులకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డును అభిమానులతో షేర్ చేసుకున్నారు. నవ్వుతున్న ఎమోజీలతో నాకు ఏం దొరికిందో చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. 
 
తాను బాగా చదవడంతో 1000 కు 887 మార్కులు వచ్చాయని... టీచర్లు ప్రోగ్రెస్ కార్డులో తను బాగా చదివింది... మా పాఠశాల ఆస్తి అని రాశారని చెప్పారు. సమంతన నటనలోనే కాదు చదువులో కూడా ముందుండేవారని ఆమె ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం సామ్ ప్రోగ్రెస్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: