రీల్ లైఫ్ లో సోనూసూద్ ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆయన హీరోలా వ్యవహరిస్తున్నారు. మరోసారి మానవత్వంతో వ్యవహరించి సోనూసూద్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. కేరళలో ఉన్న 177 మంది మహిళలను ఆయన ప్రత్యేక విమానం ద్వారా ఒడిశాకు పంపినట్లు ఎయిర్ ఏషియా అధికారులు తెలిపారు. ఒక టెక్స్ టైల్స్ ఫ్యాక్టరీలో పని చేసే 177 మంది లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలకు రాజీనామా చేసి రవాణా సౌకర్యం లేక కేరళలోనే చిక్కుకున్నారు. 
 
చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వీరి గురించి సోనూసూద్ కు తెలిసింది. వారిని ఎయిర్ ఏషియా విమానం ద్వారా కొచ్చి నుంచి భువనేశ్వర్ చేరేలా సోనూ సూద్ కృషి చేశారు. ఒక నెటిజన్ సోషల్ మీడియాలో సోనూసూద్ గొప్పతనాన్ని షేర్ చేసుకున్నారు. నెటిజన్ సోనూసూద్ మంచితనాన్ని ప్రపంచం తట్టుకోగలదా...? 177 మందిలో ఒక మహిళ భువనేశ్వర్ వెళ్ళగానే ఒక పండంటి బాబుకు జన్మ ఇచ్చిందని... ఆ బాబుకు సోనూ మీద కృతజ్ణతతో ' సోనూ సూద్ శ్రీవాత్సవ ' అని పేరు పెట్టుకుంది ఆ మాతృమూర్తి అని.... అవును ఇతను మనిషి కాదు దేవుడే... అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: