అధికారం లో ఉన్న రాజకీయ పార్టీ పై తాను అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పట్టారు అన్న కథనం పై రావు రమేష్ స్పందించారు. రావు రమేష్ ఈ సందర్భంగా ...సోషల్ మీడియాలో నాకు ఎటువంటి అకౌంట్స్ లేవని స్పష్టం చేసారు. తన పేరుతో కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారని అయన దుయ్యబట్టారు. పేస్ బుక్ ,ట్విట్టర్ , ఇన్స్టాగ్రామ్ ...ఇలా దేన్నీ నేను వాడడం లేదని అయన స్పష్టం చేసారు .

 

శనివారం రోజున అయన పేరుతో ఓ పేరొందిన రాజకీయ పార్టీ పై కొందరు తన ఫేక్ అకౌంట్ తో పోస్ట్ పెట్టినట్లు అయన దృష్టికి రావడంతో రావు రమేష్ స్పందించారు...అయితే తనకు ఆ పోస్ట్ లకు ఎలాంటి సంబంధం లేదని అయన స్పష్టం చేసారు ...దయచేసి వాటిని నమ్మొద్దని అభిమానులకు పిలుపునిచ్చారు. తన పేరుతో తప్పుడు ఖాతా ప్రారంభించి తప్పుడు ట్విట్ చేసిన వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతున్నట్లు అయన తెలిపారు    .

మరింత సమాచారం తెలుసుకోండి: