అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటన చేశారు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని అన్నారు. కరోనా కట్టడి కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరినా డబ్ల్యూహెచ్‌ఓ పట్టించుకోలేదని... వైరస్ విషయంలో చైనాను బాధ్యునిగా చేయడంలో విఫలమైందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓకు అత్యధికంగా 45 కోట్ల డాలర్ల నిధులు అమెరికా సమకూరుస్తోందని అన్నారు. 
 
డబ్ల్యూహెచ్‌ఓ ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే చైనా ప్రయాణాలపై నిషేధం విధించే వాళ్లమని.... చైనా ఒత్తిడి వల్లే డబ్ల్యూహెచ్‌ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. కరోనాతో అమెరికాలో లక్ష మంది మరణించారని... . వైరస్‌ తీవ్రతను చైనా దాచిపెట్టడంతో ప్రపంచంలో లక్షల మంది మృతి చెందారని ట్రంప్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: