రెండు రోజుల క్రితం హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆయన ఎన్నికల అధికారి పోస్టులో మళ్లీ నియమించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తనను తాను పునర్నియమించుకునే అధికారం నిమ్మగడ్డ రమేష్ కు లేదని స్పష్టం చేశారు. పోస్టులో మళ్లీ నియమించాలని హైకోర్టు ఆదేశించిందే తప్ప ఆయన వెళ్లి స్వయంలో ఆ పోస్టులో కూర్చునే వెసులుబాటు ఇవ్వలేదని పేర్కొన్నారు. 
 
హైకోర్టు తీర్పు ప్రకారం రమేష్ కుమార్ నియామకమే తప్పని... అంశంపై స్పష్టత కోసం సుప్రీంకు వెళ్లనున్నామని తెలిపారు. నిన్న శ్రీరాం చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారంటూ నిన్న ఇచ్చిన సర్క్యులర్ ను వెనక్కు తీసుకుంది. తాజా పరిణామాలతో 317 సర్కులర్ ఎన్నికల సంఘం తీసుకున్నట్టు తెలుస్తోంది. సర్క్యులర్ ను వెనక్కు తీసుకోవడంతో నిమ్మగడ్డ రమేష్ కు మరో షాక్ తగిలిందనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: