తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నేతన్నలు తమలోని ప్రతిభను బయటకు తీస్తున్నారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో సిరిసిల్లకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. తాజాగా సిరిసిల్ల నేత కార్మికుడు వెండి కొండతో పట్టు చీరను నేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 5.4 మీటర్ల పొడవు చీరలో 90 సెంటిమీటర్ల బ్లౌజ్, 70 సెంటిమీటర్ల కొంగు ఉంటుంది. 25,000 రూపాయలు వెచ్చించి విజయ్ 170 గ్రాముల వెండిని వినియోగించి కొంగును నేసాడు. 
 
ఈ చీరను ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆవిష్కరించనున్నారు. 1987లో ఈయన తండ్రి పరంధాములు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించగా విజయ్ వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచానికి సిరిసిల్ల ఖ్యాతిని చాటుతున్నాడు. ఎవరైనా సహకారం అందిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని విజయ్ చెబుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: