ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త చెప్పారు. ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్ల ఖాతాలలో పది వేల రూపాయలు జమ చేయనున్నారు. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఈ పథకానికి 33,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 
 
గతేడాది ఈ పథకం ద్వారా 2,36,000 మంది లబ్ధి పొందారు. వీరితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూన 4వ తేదీన 10,000 రూపాయలు ఖాతాలలో జమ చేయనుంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు/ ఎంపీడీవోలు పరిశీలించి దరఖాస్తులకు ఆమోద ముద్ర వేయనున్నారు. గతేడాది లబ్ది పొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: