మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాలో పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయి అనే విషయం అందరికి తెలిసిందే. ప్రతీ పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక పాటల్లో డాన్స్ లు కూడా ప్రేక్షకులను చాలా బాగా మెప్పించాయి. 

 

ఇక ఇవి సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. దీనికి ఎవరో ఒకరు టిక్ టాక్ చేయడం జరుగుతూనే ఉంది. తాజాగా బుట్ట బొమ్మ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ పొందింది. అంటే ఈ పాటను దాదాపు 20 కోట్ల మంది వరకు వీక్షించారు. ప్రపంచంలోనే ఇది యుట్యూబ్ లో పదో స్థానంలో నిలిచింది. గ్లోబల్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో పదో స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: