ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించడం ప్రభుత్వం చెప్పిన అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఆయన ఆక్షేపించారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా కొనసాగే నా హక్కుని హైకోర్ట్ స్పష్టం చేసిందని ఆయన అన్నారు. 

 

తనను ప్రభుత్వం తొలగించలేదు అని ఆయన స్పష్టం చేసారు. ఆర్డినెన్స్ జీవో లను హైకోర్ట్ రద్దు చేసిందని చెప్పారు. హైకోర్ట్ తీర్పు ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అని, రాష్ట్ర ప్రభుత్వం నిన్న చెప్పిన విషయాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. కనగరాజ్ నియామకాన్ని రద్దు చేసిందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: