గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చాకయినా వారి గత చరిత్ర ప్రభావం, పాలనపై పడకుండా చూసుకుంటారని వైసీపీ నేతల నుంచి అందరూ ఆశించారు. కానీ ఆ నేరస్వభావం మార్చుకోకుండా... కక్షలు సాధించడానికి, అక్రమార్జనల కోసం వ్యవస్థలనే నాశనం చేసే స్థితికి వచ్చారు పాలకులని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. 

 

స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులను నామినేషన్ కూడా వేయనీయకుండా దౌర్జన్యాలు చేసి ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే కూల్చేయాలనుకున్నారని ఆయన మండిపడ్డారు. దాదాపు 65 కేసుల్లో కోర్టులు వీళ్ళ చర్యలను కట్టడి చేయకపోయి ఉంటే రాష్ట్రం ఏమై ఉండేదా అని భయం వేస్తోందన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల భాష చూస్తుంటే వీధి రౌడీలు వీళ్ళకన్నా నయమనిపించే పరిస్థితని... ఇకనైనా వైసీపీ పాలకులు తమ నేరపూరిత స్వభావాన్ని మార్చుకోవాలన్నారు. ప్రజలు మిమ్మల్ని గౌరవప్రదమైన స్థానాల్లో కూర్చోబెట్టారని.. ఆ మర్యాదను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: