కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అక్కడ తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు వేగంగా పెరగడం తో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది.కరోనా కట్టడి లో ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించిన కేరళ సర్కార్ ఇప్పుడు ఈ స్థాయిలో కేసులు రావడం చూసి ఆందోళన వ్యక్తం చేస్తుంది. లాక్ డౌన్ ని కూడా కఠినం గా అమలు చేస్తుంది ప్రభుత్వం. 

 

ఇదిలా ఉంటే ఆ రాష్ట్రంలో నేడు భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు రాష్ట్రంలో 61 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వాటిలో 20 విదేశాల నుండి తిరిగి  వచ్చిన వారివి. 37 ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వచ్చిన వారివి. 4 ఒకరి నుంచి మరొకరికి వ్యాపించాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. మొత్తం క్రియాశీల కేసులు 670 వద్ద ఉన్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: