సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తప్పుడు వార్తలకు మాత్రం లోటు లేదు. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి గా చేసి చూపించడమే కాదు... కొన్ని విషయాలను సృష్టించడం కూడా జరుగుతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన సోదరి కుటుంబానికి ఫ్లైట్ బుక్ చేసాడు అనే వార్తలు వచ్చాయి. 

 

దీనిపై కథనాలు కూడా ప్రసారం కాగా దీనిపై స్పందించిన అక్షయ్ కుమార్... నా సోదరి మరియు ఆమె ఇద్దరు పిల్లల కోసం చార్టర్ ఫ్లైట్ బుక్ గురించి వచ్చిన ఈ వార్త మొదటి నుండి చివరి వరకు నకిలీ అని ఒక లింక్ ని షేర్ చేసాడు. లాక్డౌన్ అయినప్పటి నుండి ఆమె ఎక్కడికీ ప్రయాణించలేదు మరియు ఆమెకు ఒకే ఒక బిడ్డ ఉందన్నాడు. చట్టపరమైన చర్యల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: