సంగీత ద్వయం సాజిద్-వాజిద్‌కు లో ఒకరు అయిన వాజిద్ ఖాన్ కన్ను మూశారు. 42 ఏళ్ళ  వాజిద్ అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్తను గాయకుడు సోను నిగమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. “నా సోదరుడు వాజిద్ మమ్మల్ని విడిచిపెట్టాడని పోస్ట్ చేసారు. దీనిపై సలీం మర్చంట్ మాట్లాడుతూ... అతనికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు.  గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారని... కొంత కాలం క్రితం కిడ్నీ కూడా మార్చారు అని ఆయన పేర్కొన్నారు. 

 

గత నాలుగు రోజులుగా వెంటిలేటర్‌లో చికిత్స పొందుతున్నారని... పరిస్థితి మరింత క్షీణించడంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రారంభమైందని ఆ తర్వాత ఆరోగ్యం విషమించి కన్ను మూసారని చెప్పారు. ఆయన కరోనాతో మరణించారు అనే ప్రచారం కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: