హైకోర్ట్ పై శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పల రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజాహిత కార్యక్రమాలను అమలు పర్చకుండా కోర్టులు ఆటంకపర్చడం మాకు ఆమోదంయోగ్యం కాదన్నారు ఆయన. కోర్ట్ తీర్పులతో తాము ఏకీభవించడం లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు ప్రజలు కూడా కోర్టులకు ఉద్దేశాలను ఆపాదించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. 

 

అప్పుడు 44 మందికికాదు... 4 కోట్ల మందికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రత్యర్థులు, కోర్టులు అడ్డుకోవడమేంటని ఆయన నిలదీశారు. ఇంగ్లిష్‌ మీడియం, పేదలకు ఇళ్లు, కొన్ని కార్యాలయాల తరలింపును సైతం కోర్టులు అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రత్యర్ధులు ఎడిట్ చేసిన వీడియోలను చూసి తీర్పులు ఇవ్వడం ఏంటీ అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: