దాదాపు రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత నేటి నుంచి దేశ వ్యాప్తంగా రైలు సర్వీసులు మొదలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో నేటి నుంచి దేశవ్యాప్తంగా 200 స్పెషల్ రైళ్లు పరుగులు తీస్తాయి. లక్ష నలభై ఐదు వేల మందికి పైగా వీటిల్లో ప్రయాణం చేసే అవకాశం ఉందని కేంద్ర రైల్వే శాఖ నిన్న పేర్కొంది. 

 

ఈ స్పెషల్ రైళ్లలో జూన్ 30 వరకు దాదాపు 26 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారని తెలిపింది రైల్వే శాఖ. ఇక ప్రయాణాలు చేసే వారికి కీలక సూచనలు చేసింది రైల్వే శాఖ. అందరూ కూడా 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్ కి రావాలి. టికెట్ ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తారు. అందరికి స్క్రీనింగ్ అనేది తప్పనిసరి. ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే అనుమతించే అవకాశం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: