ఇప్పుడు మన తెలుగు సినిమా పాటల మీద డైలాగుల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో ఒక రేంజ్ లో సందడి చేస్తున్నాడు. ఏదోక పాట తో అతను సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాడు. వరుసగా అతను టిక్ టాక్ వీడియోలు విడుదల చేస్తూ వస్తున్నాడు. 

 

తాజాగా అతను సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మైండ్ బ్లాక్ అనే పాటను భార్య క్యాండిస్ తో కలిసి చేసాడు. ఈ పాటను ఇటీవల చేసిన వార్నర్ మరోసారి ఈ పాటకు డాన్స్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనికి రష్మిక మందన  మహేష్ బాబు ని ట్యాగ్ చేయగా రష్మిక స్పందించింది. అందరూ చూడండి అంటూ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: