ఏపిలో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటితో ఏడాది పాలన ముగించుకున్నారు.  మాట ఇచ్చి మడమ తిప్పడం మా వంశంలోనే లేదన్న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాటలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్న ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలలో ప్రజలకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నారు.  అర్హులైన వారందరికీ పథకాలు అమలు అయ్యేలా చూస్తున్నారు. గ్రామ వాలంటైర్లను ఏర్పాటు చేసి ప్రతి పల్లెలో ప్రజలకు పెన్షన్, రేషన్, ఇతర అత్యవసర పనులు ఏవైనా సరే వెంటనే అమలు జరిగేలా చూస్తున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ, ఈ తెల్లవారుజామునే ప్రారంభమైంది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ ను అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బయో మెట్రిక్ బదులుగా పెన్షనర్ల చిత్రాలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక మొబైల్ యాప్ ను సిద్ధం చేశారన్న సంగతి తెలిసిందే.

 

అన్ని జిల్లాల్లోని 2.37 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఈ డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి పోర్టబిలిటీ విధానంలో పెన్షన్లను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 58.22 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉండగా, వారికి ఈ నెల పెన్షన్ కోసం ప్రభుత్వం రూ. 1,421.20 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: