పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఏలూరు సహా కొన్ని గ్రామీణ ప్రాంతాలో కూడా కరోన కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తాజాగా జిల్లాలో మరో ఏడు కేసులు నమోదు అయ్యాయి. 

 

ఏలూరు అగ్రహారంలో రెండు జేసులు, తూర్పు వీధిలో రెండు కేసులు... మెయిన్ బజార్‌లో ఒకటి,  పెదపాడు నిడదవోలులలో ఒక్కో కేసు నమోదు అయిందని అధికారులు వెల్లడించారు. దీనితో మొత్తం కరోనా కేసుల సంఖ్య 133కు చేరుకుందని అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో 76 మందికి చికిత్స అందిస్తున్నారు. ఏలూరులో పాజిటివ్‌తో ఒక వ్యక్తి మృతి చెందారు. అతని భార్యకు కూడా కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: