మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటరు. ఈ సినిమాలో నో పెళ్లి అనే పాటను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ సాంగ్ కి యుట్యూబ్ లో మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు 5 మిలియన్ల మంది ఈ వీడియో ని వీక్షించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

 

కాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యాలా లేక సినిమా థియేటర్ లోనే విడుదల చెయ్యాలా అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలు దీనిపై చర్చల్లో ఉన్నారని సమాచారం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: