దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 కోట్ల మంది ఆరోగ్య సేతు యాప్ ని వాడుతున్నారని కరోనా కట్టడి లో అది చాలా బాగా ఉపయోగపడిందని ప్రధాని అన్నారు. కరోనా వారియర్లపై దాడులు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేసారు. 2025 నాటికి దేశంలో టీబీ తరిమేస్తామని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 

 

దేశంలో ఇప్పటికే కోటి పీపీఈ కిట్లు తయారు చేసి కరోనా వారియర్లకు అందించామని, టెలీ మెడిసిన్ వైపు దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైద్యరంగ నిపుణులకు ప్రధాని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రెండేళ్లలోనే కోటి మంది పేదలు ప్రయోజనం పొందారని అన్నారు. దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్ ఆసుపత్రుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్న ఆయన... గడచిన ఐదేళ్లలో 30 వేల ఎంబీబీఎస్ సీట్లు, 15 వేల మెడికల్‌ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు పెంచగలిగామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: