ఈ మద్య కరోనా వచ్చినప్పటి నుంచి మనుషులకు మనశ్శాంతి లేకుండా పోతుంది.  కరోనా అని పేరు చెబితేనే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోెజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. కరోనా వచ్చిందంటే పద్నాలు రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తల్లి క్వారంటైన్ సెంటర్‌ వెళ్లాలని చెప్పిందని ఓ కొడుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్వారంటైన్ అంటే జనాలకు అదోరకం బందీ అన్నట్టు భయపడిపోతున్నారు.. కొంత మంది అక్కడ నుంచి పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసిన తల్లి క్వారంటైన్ కి వెళ్లమని చెబితే.. మానసికంగా కృంగిపోయి.. మనస్తాపంతో కొడుకు చేసిన పనికి తల్లి తల్లడిల్లిపోతోంది.

 

దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  సహద్లిపూర్ గ్రామానికి చెందిన సూరజ్ సింగ్ యాదవ్ (23) మహారాష్ట్రలోని నాసిక్‌లో వడ్రంగిగా పనిచేసేవాడు. లాక్‌డౌన్ కారణంగా మే 15 న అతను గ్రామానికి వచ్చాడు. నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్ ఉండాలి. దీంతో అతన్ని అపోలో కాలేజీలోని క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. అయితే అక్కడి నుంచి మే 23న తప్పించుకొని వచ్చాడు. అత‌ని త‌ల్లి, సోద‌రుడు తిరిగి క్వారంటైన్ సెంట‌ర్‌కు దిగ‌బెట్టారు. ఇక తనకు ఈ క్యారంటైన్ గొల తప్పేలా లేదని కృంగిపోయి.. బాధతో అతడు గంగా న‌ది ఒడ్డున ఉన్న జమదా ఆశ్రమం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: