గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎంత పడింతో అందరికీ తెలిసిందే. అయితే పర్యాటక కేంద్రాలపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా అధికంగా లేకపోయినా లాక్ డౌన్ ఆంక్షలు మాత్రం సీరియస్ గానే పాటించారు. ఆ మద్య గోవా, కేరళాలో జీరో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.  అప్పట్లో ఇక్కడ లాక్ డౌన్ గట్టిగానే పాటించారు.. ప్రజలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలు తూ.చ.తప్పకుండా పాటించారు. దాంతో కరోనా కేసులు చాలా శాతం తగ్గిపోయాయి.  తాజాగా ‌కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ట్లుగానే త‌మ రాష్ట్రంలో తాజా లాక్‌డౌన్ స‌డలింపుల‌న్నీ వ‌ర్తింప‌జేస్తామ‌ని, అయితే అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు మాత్రం ఇప్ప‌ట్లో అనుమ‌తించ‌బోమ‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ తెలిపారు.

 

అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు సంబంధించి ఇక‌పై ఎలాంటి ప‌ర్మిష‌న్‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ది. అయితే, దీనిపై త‌మ రాష్ట్రంలో ప‌రిస్థితుల మేర‌కు నిర్ణ‌యం తీసుకునే అధికారం రాష్ట్రాల‌కు ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో గోవా సీఎం తాజా నిర్ణ‌యం తీసుకున్నారు.   ‌కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అన్ని స‌డ‌లింపులను రాష్ట్రంలో కూడా అమ‌లు చేస్తాం. అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు మాత్రం ఇప్పుడ‌ప్పుడే అనుమ‌తించం అని గోవాం సీఎం చెప్పారు.  కేంద్ర హోంశాఖ లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌కు సంబంధించి ఆదివారం మార్గద‌ర్శ‌కాలు జారీచేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: