దేశ వ్యాప్తంగా కరోన కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు గానూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 11రాష్ట్రాల్లో మొత్తం 55 స్థానాలు ఖాళీ కాగా 37 స్థానాలు ఏక గ్రీవం అయ్యాయి. మిగిలిన 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఏపీ తో పాటుగా ఆర్రు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలను నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. 

 

జూన్ 19 న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఏపీలో నాలుగు స్థానాలకు తెలంగాణాలో 2 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా తెలంగాణాలో రెండు స్థానాలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: