సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెర‌వేర‌క ఉద్యోగులు ఉసూరుమంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసారు. అన్న‌దాత‌ల‌కు తీర‌ని అన్యాయం చేశారన్నారు. ఇసుక‌లేక కూలిబ‌తుకులు కూలిపోతున్నాయని పేర్కొన్నారు. బెదిరింపులు త‌ట్టుకోలేక ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లిపోతున్నాయన్నారు. ద‌ళితుల్ని న‌డిరోడ్డున ప‌డేశారని మండిపడ్డారు. 

 

బీసీల‌కు వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. మైనారిటీల‌ను అవమానించారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ చార్జీలు పెరిగాయన్నారు లోకేష్. క‌రెంటు చార్జీలు షాక్ కొట్టాయన్నారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచేశారని... మ‌ద్యం నిషేధిస్తామంటూ చీప్‌లిక్క‌ర్ నాలుగింత‌ల‌కు అమ్ముకుంటూ ప్రాణాలు హ‌రించేస్తున్నారని పేర్కొన్నారు. జ‌గ‌న్‌రెడ్డి చేత‌కాని పాల‌న‌తో జ‌నం అందరికీ వేద‌నే మిగిలిందని ఎద్దేవా చేసారు లోకేష్. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్ లు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: