ముంబై లో సినిమా షూటింగ్ లకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా నటులు అందరూ ఒక చోట చేరే ప్రతీ సీన్ ని నిషేధించింది. పెళ్లి సీన్ లు వద్దని చెప్పింది. అదే విధంగా ఫైట్ సీన్ లు కూడా వద్దని పేర్కొంది. అలాగే ముద్దులు హగ్ లు వద్దని మార్కెట్ సన్నివేశాలు వద్దని చెప్పింది. 

 

అంతే కాకుండా ఎవరి మేకప్ వాళ్ళే వేసుకోవాలని భౌతిక దూరం పాటించాలి అని చెప్పింది. ఎవరూ కూడా అనవసరంగా కలిసి ఉండవద్దు అని కలిసి దగ్గరకు వచ్చినా సరే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది మహారాష్ట్ర సర్కార్. మరి షూటింగ్ లను ఎప్పటి నుంచి మొదలుపెడతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: