ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు  పెరగడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ విభాగాల్లో కరోనా కేసులు పెరగడ౦ మరో ఎత్తు. క్రమంగా ప్రభుత్వ విభాగాల్లో ఆందోళనకరంగా కేసులు పెరుగుతున్నాయి. నేటి ఉదయం నీతి అయోగ్ లో కరోనా కేసులు రాగా ఇప్పుడు సిబిఐ లో కరోనా కేసులు బయటపడ్డాయి. 

 

ఇద్దరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులకు కరోనా పరిక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం వారు నిర్బంధంలో  ఉన్నారు. సిబిఐ శానిటైజేషన్, సామాజిక దూరం మరియు ముసుగులు ధరించడం వంటి కఠినమైన విధానాలను అనుసరిస్తోందని అధికారులు చెప్తున్నారు. వారితో సంబంధం ఉన్న అందరు అధికారులను కూడా ఇప్పుడు క్వారంటైన్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: