లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు చాల ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన ఊరిలో కడుపు నింపుకోవడానికి ఆహారం దొరక్క సొంత ఊరికి వెళ్ళడానికి చేతిలో డబ్బులు లేక బతుకు జీవుడా అంటూ వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళుతున్నారు. కొందరు ఆకలి తో అలమటించి చనిపోయిన దాఖలాలు కూడా లేకపోలేదు. వారి భాదను గమనించిన నోయిడాలోని  ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ చిన్నారి తానూ దాచిపెట్టుకున్న 48,000 వేల తో   ముగ్గురు వలస కార్మికులను తమ సొంత ఊరు ఝార్ఖండ్ కి వెళ్లేందుకు ఖర్చు చేసింది. అందులో ఒకరు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతున్నారు. ఆ ముగ్గురు వలస కార్మికులు సొంత ఊరుకి పోవడానికి తాను దాచుకున్న పొదుపు నుండి నలభై ఎనిమిది వెలను ఖర్చు చేసి విమాన టికెట్ లను కొని ఇచ్చింది. ఈ విషయమై ఆ ముగ్గురు వలస కార్మికులు ఆ చిన్నారి నిహారికా ద్వివేది 
 కి కృతాగనతలు తెలిపారు.

IHG

 

అయితే ఈ విషయాన్నీ తెలుసుకున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఆ బంగారు తల్లికి బంగారు భవిష్యత్తు ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆ పాపను ప్రశంసించాడు.  ఈ విషయమై ఆ చిన్నారిని ఇంత చిన్న వయసులో నీకు ఇంతటి గొప్ప మనసు ఎలా వచ్చింది అని అడుగగా ..ఆ చిన్నారి ...వలస కార్మికులకు తానూ టీవీ లలో మరియు వార్త పత్రికలలో మరియు సోషల్ మాధ్యమాల ద్వారా వారి ఇబ్బందులు తెలుసుకుంటూన్నావు. ఆ రోజు నేను మా బాల్కనీ నుండి రోడ్ పై నడచుకుంటూ తమ స్వస్థలాలకు వెళుతున్న వలసకార్మికులను చూసాను అయితే వారిని ఆయా చూసినప్పుడు నాకు వారికీ ఏమైనా సాయం చేయాలనిపించింది. అయితే అప్పుడు వారికీ నేను దాచిపెట్టుకున్న కొంత డబ్బును ఇవ్వాలనిపించింది. అయితే అప్పుడే ఈ విషయంగురించి మా అమ్మానాన్నలతో చర్చించాను. అందుకు వారు నన్ను ప్రోత్సహించారు. ఆ ముగ్గురు వలస కార్మికులకు ఝార్ఖండ్ వరకు విమాన టికెట్ ని తీసియిచ్చి వారు తమ స్వస్థలాలకు వెళ్లేందు సాయపడ్డాను...అని తెలిపింది ...అయితే ఈ చిన్నారిని భరత్ దేశం యావత్తు ఇప్పుడు ప్రశంసిస్తోంది ....

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: