అమెరికా శ్వేతా సౌధం తొలిసారిగా చీకటిలో గడుపుతోంది. అవును ఇది నిజమే ...అందుతున్న సమాచారం ప్రకారం వైట్ హౌస్ సమీపం లో నిరసన కారులు మంటలు రగిల్చి నిరసనలు తెలియజేసారు ..దింతో వైట్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పొగలో మునిగి పోయాయి. విషయాన్నీ గ్రహించిన అధికారులు శ్వేతా సౌధం లోని లైట్లు అన్నింటిని ఆపివేశారు. నిరసన కారుల ఈ ఆగ్రహ జ్వాలలకు కారణం ఏమిటంటే గత ఐదు రోజుల క్రితం జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీసుల అదుపులోమరణించాడు.

 

 

ఆ రోజు అమెరికాలో కనీసం 140 నగరాల్లో నిరసనలు చెలరేగాయి. ఈ దుర్ఘటన వల్ల అన్ని ప్రాంతాలు హింసాత్మకంగా మారాయి. కనీసం 21 రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ యొక్క క్రియాశీలతను ప్రేరేపించాయి. జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయి ఇది ఆరొవ రోజు కావడంతో శ్వేతా సౌధం చుట్టూ నిరసనకారుల తాకిడి ఏర్పడి మహా ఉత్పాతాన్ని రేపింది. దింతో అధికారులు వైట్ హౌస్ ని చీకటి లో ఉంచవలసి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: