ఇప్ప‌టికే కరోనా మ‌హ‌మ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌పంచానికి మ‌రో ముప్పు పొంచి ఉంద‌ని అమెరికాకు చెందిన ఫిజీషియన్‌ డాక్టర్‌ మైకెల్‌ గ్రెగర్ షాకింగ్ న్యూస్ చెప్పారు‌. కరోనా వైరస్‌ను మించిన విపత్తు మాన‌వాళి ముంగిట ఉన్నదని, దీనికి పౌల్ట్రీ పరిశ్రమనే కారణం కాబోతున్నదని ఆయ‌న‌ హెచ్చరించారు. ఈ కొత్త మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సగం జనాభా తుడిచిపెట్టుకుపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న అన్నారు. గ్రెగెర్ త‌న *హౌ టు సర్వైవ్‌ ఏ పాండెమిక్‌* పుస్త‌కంలో వివ‌రించారు. డాక్ట‌ర్ గ్రేగ‌ర్ శాఖాహారి. మాంసాహార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆయ‌న ఉద్య‌మిస్తున్నారు.

 

పౌల్ట్రీ కోళ్ల వ్యర్థాలలో అధిక స్థాయిల్లో ఉండే అమ్మోనియా వల్ల అనేక వ్యాధులు ప్ర‌బ‌లుతాయ‌ని గ్రెగర్‌ చెప్పారు. పౌల్ట్రీ కోళ్లను తక్కువ సంఖ్యలో అది కూడా బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్ర వాతావరణంలో పెంచాలని సూచిస్తున్నారు. 1997లో చైనా, హాంకాంగ్‌లో ప్రబలిన హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల లక్షలాది కోళ్లను చంపేయాల్సి వచ్చిందని చెప్పారు. 2003, 2009 లోనూ చైనా వెలుపల ఈ వైరస్‌ ప్రబలడాన్ని బట్టి మరోసారి ఈ వైరస్‌ వ్యాపించే ప్రమాదమున్నదని ఆయ‌న హెచ్చ‌రించారు. అయితే.. కోళ్ల పెంపకం పద్ధతులను మార్చడం వల్ల ఈ ముప్పును నివారించవచ్చని డాక్టర్‌ గ్రెగర్ చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: