ఇప్ప‌టికే కరోనా మ‌హ‌మ్మారితో అల్లాడుతున్న ప్ర‌పంచంపై ఎబోలా వైరస్ మ‌ళ్లీ వ్యాప్తి చెందుతుండ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. కాంగో దేశంలో ఎబోలా వైరస్ వ్యాపిస్తుండటంతో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నాయి. ఈ దేశంలోని ఈక్వెటర్ ప్రావిన్సు పరిధిలోని వంగట హెల్త్ జోన్ లో ప్రబలిన ఎబోలా వైరస్ వల్ల ఆరుగురు ఆసుపత్రిలో చేరగా, వారిలో నలుగురు మరణించడం క‌ల‌క‌లం రేపుతోంది. మరో ఇద్దరు రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

 

కాంగో దేశంలో ఎబోలా వైరస్ సోకిందనే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. కాంగో దేశంలో 1976లో మొదటిసారి వచ్చిన ఎబోలా వైరస్ 11 సార్లు ప్రబలింది. కాంగో వైద్యాధికారులతోపాటు ప్రపంచఆరోగ్య సంస్థ అప్రమత్తమై ఎబోలా వైరస్ కట్టడికి చర్యలు చేపట్టింది. ఈ నేప‌థ్యంలో ముందుముందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మ‌రి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: