తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం వచ్చిందంటే చాలు... రాజధాని హైదరాబాద్‌తో పాటు.. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు అంతెందుకు ప్రతీ పల్లెలోనే ఉత్సవం ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం... ఆవిర్భావ వేడుకలను అంబరాన్ని తాకేవి. అయితే, కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్‌తో ఈ సారి పరిస్థితి మారిపోయింది... కరోనా కట్టడికి భౌతికదూరం పాటించడమే ఏకైక మార్గం కాగా.. ఈ సారి నిరాడంబరంగా వేడుకలు నిర్వహించనున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.

 

అనంతరం శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ నెరవేర్చారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తామంతా నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు.   ఇక, మధ్యాహ్నం రాజభవన్‌లో గోశాలను ప్రారంభించి మొక్కలు నాటనున్నారు గవర్నర్ తమిళిసై... మరోవైపు, జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లు జెండాలను ఆవిష్కరించనున్నారు. ఇక, రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేయనున్నారు సీఎం కేసీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: