అసలు కరోనా కట్టడిలో కేరళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అనే మాట వాస్తవం. కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉన్నా సరే సమర్ధవంతంగా అక్కడి ప్రభుత్వం దాన్ని ఎదుర్కొని నిలబడింది. రోజు రోజు కి కరోనా కేసులు అక్కడ పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఒక్క రోజే అక్కడ 57 కేసులు నమోదు కావడం కంగారు పెట్టింది. 

 

అయితే అక్కడ లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం తోనే కేసులు పెరుగుతున్నాయి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొత్తగా రెడ్ జోన్ ప్రాంతాలు అక్కడ పెరుగుతున్నాయి. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి ద్వారానే తమ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర సిఎం భావిస్తున్నారు. రాత్రివేళల్లో కర్ఫ్యూ పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: