యూజ‌ర్ల యొక్క వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌, గోప్య‌త‌కు ఆఫిల్ సంస్థ ఎంత ప్రాధాన్య‌త ఇస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆఫిల్ అప్లికేష‌న్లు అన్ని చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాంటి ఆఫిల్ సంస్థ త‌యారు చేసిన ఓ అఫ్లికేష‌న్లోనే ఓ భార‌తీయుడు త‌ప్పు క‌నిపెట్టాడు. అంతే కాదు అత‌డికి బంపర్ గిఫ్ట్ కూడా వ‌చ్చింది. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే ఫేస్‌బుక్‌, గూగుల్ వంటి యాప్స్‌లోకి లాగిన్ అయ్యే క్ర‌మంలో యూజ‌ర్ల భ‌ద్ర‌త కోసం 2019లో సైన్ ఇన్ విత్ ఆఫిల్ పేరిట ఓ అఫ్లికేష‌న్ తీసుకు వ‌చ్చింది. 

 

అయితే ఇందులో ఆ యాప్స్‌లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క‌రు ఆపిల్ అప్లికేష‌న్లోకి కూడా లాగిన్ అవ్వాలి. ఇందులో భ‌ద్ర‌తా ప‌ర‌మైన లోపాలు ఉన్న‌ట్టు ఢిల్లీకి చెందిన టెకీ  భావు క్‌ జైన్‌ కనిపెట్టాడు. సంస్థ అంతర్గత విచారణలో కూడా ఇది నిజమేనని తేలింది. దీం తో ఆపిల్‌ భారీ నజరానా ప్రకటించింది.  అత‌డికి ఏకంగా రు. 75 ల‌క్ష‌ల గిఫ్ట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: