లాక్ డౌన్ లో ఇప్పుడు మూగ జీవాలను ఆదుకునే వారే కరువయ్యారు. వాటికి ఆహారం నీళ్ళు అందించే వారు దాదాపుగా కనపడటం లేదు. కరోనా దెబ్బకు ఎవరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక ఇది పక్కన పెడితే తాజాగా జైపూర్ కి చెందిన ఒక యువకుడు మూగ జీవాల పాలిట దైవంగా మారిపోయాడు. 

 

రాజ‌స్థాన్‌లోని జైపూర్‌న‌కు చెందిన వీరేన్ శర్మ అనే యువకుడు 70 రోజుల పాటు జంతువులకు పండ్లు కాయలు అందించాడు. సొంత డబ్బులతో అతను ఈ ఆహారం ఏర్పాటు చేసాడు. తన దగ్గరలో ఉన్న కోతులు, కుక్కలు, ఆవులు, ఇతర జంతువులకు లాక్ డౌన్ సమయంలో ఆహారం అందించేందుకు వీరెన్ శర్మ దగ్గరలో ఉన్న గ్రామాలను తిరిగాడు. శున‌కాల కోసం 600 ఫుడ్ ప్యాకెట్లను ప్రతీ రోజు సిద్దం చేసి అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: