ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు గెట్టింగ్ గ్రోత్ బ్యాక్ గురించి ప్రసంగిస్తూ దేశంలో అన్ లాక్ మొదటి దశ ప్రారంభమైందని వారంలో రెండో దశ ప్రారంభమవుతుందని చెప్పారు. కరోనా నుంచి ప్రజలను రక్షించుకోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా కృషి చేయాలని అన్నారు. జూన్ 8 తర్వాత మిగతా రంగాల్లోను అన్ లాక్ మొదలవుతుందని అన్నారు. 
 
కరోనాపై సవాళ్లు తాత్కాలికమేనని అన్నారు. పేద ప్రజల కోసం కేంద్రం 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తొలి ప్రాధాన్యం అని అన్నారు. జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణలతో ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని అన్నారు. దీర్ఘకాలిక దృష్టితోనే ఆత్మ నిర్భర్ ప్యాకేజీని ప్రకటించామని అన్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: