దేశ ఆర్ధిక వ్యవస్థకు ఈ సవాళ్లు చాలా తాత్కాలికం అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలను సృష్టించడానికి గానూ సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు మోడీ. ఇప్పటికే 53 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది అని అన్నారు. ఇక ఆత్మ నిర్భర అభియాన్ ప్యాకేజి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

దీర్ఘకాలిక ఉపయోగాల కోసమే, భవిష్యత్తు ని దృష్టి లో ఉంచుకునే తాము ప్యాకేజిని ప్రకటించామని ఈ సందర్భంగా మోడీ అన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసే పనిలో ఉన్నామని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులకు వలస కార్మికులకు తాము అండగా నిలిచామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: