ప్రధాని నరేంద్ర మోదీ గెట్టింగ్ గ్రోత్ బ్యాక్ ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల వల్ల ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాటం ఆపకూడదని... అదే సమయంలో దేశ ఆర్థికాభివృద్ధి ఆగకూడదని చెప్పారు. రైతులు కష్టాన్ని గిట్టుబాటు ధరలకు అమ్ముకునేలా మార్పులు రావాలని... సవాళ్లు తాత్కాలికమే అని వృద్ధి రేటు పుంజుకుంటుందని తెలిపారు. 
 
దేశ ఆర్థిక రంగాన్ని సుస్థిరం చేయాలని... సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని మోదీ తెలిపారు. భారత్ లో అపార వనరులున్నాయని... కావాల్సినంత నైపుణ్యం ఉందని అన్నారు. అన్ లాక్ మొదటి దశ ప్రారంభమైందని... వారం తర్వాత రెండో దశ ప్రారంభమవుతుందని అన్నారు. దేశ ప్రధానిగా భరోసా ఇస్తున్నానని తనపై విశ్వాసం ఉంచాలని మోదీ అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: