దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం తప్పనిసరిగా సూచనలు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు సర్కార్ సెలూన్ల ద్వారా కరోనా సోకే అవకాశం ఉండటంతో కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. హెయిర్ కటింగ్ సెలూన్లకు ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ తప్పనిసరి చేసింది. 
 
ఈ మేరకు హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి. హ్యాండ్ శానిటైజరు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని.... సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని... వాడిన బ్లేడ్లను తిరిగి ఉపయోగించరాదని, హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని ఆదేశించింది. కటింగ్ చేసేవారు ఫేస్ మాస్క్, గ్లౌజులను తప్పనిసరిగా ధరించాలను సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: