ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల్లాడుతోంది. ఒక్క మహారాష్ట్ర‌లోనే వేలాది కేసులు న‌మోదు అవుతుండ‌గా... వందల మంది చ‌నిపోతున్నారు. ఈ పెను ప్ర‌మాదం నుంచి ముంబై కోలుకోకుండానే అప్పుడు మ‌రో ప్ర‌మాదం గుప్పిట్లోకి ముంబై వెళ్లిపోయేలా ఉంది. ఇక మ‌న దేశాన్ని నింఫ‌న్ తుఫాన్ ఎలా ముంచేసిందో చూశాం. దీని నుంచి కోలుకోక ముందే ఇప్పుడు అరేబియా స‌ముద్రం ద్వారా మ‌రో తుఫాన్ దూసుకు వ‌స్తోంది.  అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్ తీరాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. 

 

ఇక ఈ నిస‌ర్గ తుఫాన్ ముంబై స‌మీపంలో తీరం దాటే అవ‌కాశం ఉండ‌డంతో ముంబై న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు ప‌డి జ‌న‌జీవ‌నం తీవ్ర అస్త‌వ్య‌స్తం కానుంద‌ని కూడా హెచ్చ‌రించింది. ఈ ప్ర‌భావం వ‌చ్చే 24 - 36 గంట‌ల్లో ముంబై న‌గ‌రంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. ఇక ముంబైలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భారీ వ‌ర్షాలు ప‌డితే క‌రోనా కేసులు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: