ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు అమెరికాను కకావిలం చేస్తుంది. మొన్నటి వరకు అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ ఇప్పుడు రష్యా.. ఇలా కరోనా ధాటికి విల విలలాడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో అయితే కరోనా కరాళ నృత్యం చేస్తుంది. అమెరికాలో గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల 743 మంది మ‌ర‌ణించారు. జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 105099కి చేరుకున్న‌ది. ఆ దేశంలో మొత్తం కోవిడ్‌19 కేసులు ల‌క్షా 80 వేలు దాటాయి.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 373439 మంది మ‌ర‌ణించారు.  ఒక రకంగా చెప్పాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా మూడో శాతం అమెరికాలోనే మరణాలు సంబవించాయంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుంగా ఉందో అర్థమవుతుంది. మరోవైపు ఇక్కడ జాతీ వివక్షతకు సంబంధించిన గొడవలు కూడా దారుణంగా జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: